సరిపోల్చలేని ప్రేమ Saripolchaleni Prema Lyrics – Pastor Sagar

సరిపోల్చలేని ప్రేమ Saripolchaleni Prema Lyrics – Pastor Sagar

పల్లవి: సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును నీవేగా నా క్షేమము కాచావు గతకాలము నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము వర్ణించలేను యేసయ్య కీర్తింప ఉండలేనయ్య.

1: అందరు విడిచి ఒంటరినైతిని ఆదరణే కరువై కుమిలిపోతిని ఆశ్రయుడా నీవు తోడుండగా ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్య – నీవు లేని నా
జీవితం ॥ సరిపోల్చగలనా ॥

2: కుదరని వ్యాధి విడువని వేదన జీవితమే బరువై విసిగిపోతిని వైద్యుల కంటే మహనీయుడవు స్వస్థతనిచ్చే జీవధాతవు కడవరకు నీపై విశ్వాసమే ఊపిరి ఆగిన అది విజయమే లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో. ॥సరిపోల్చగలనా ॥

3: ప్రార్ధించగానే నా చెంతచేరి కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? పరిస్ధితులేవైనా నను విడువక ఓ మంచి స్నేహమై నిలిచావుగా శోధనలన్నిటిలో బలశౌర్యమై శత్రువు కోటలన్ని కూల్చావుగా ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు
|సరిపోల్చగలనా||

Song Name : సరిపోల్చలేని ప్రేమ || Saripolchaleni Prema
Lyricys, Tune Composed & Sung By : Pastor. sagar
Music : Bro.Immi Johnson

Leave a comment